సుబ్రహ్మణ్య స్వామి ఒక బ్లాక్ మెయిలర్.. శాడిస్ట్.. వీహెచ్
posted on Nov 21, 2015 12:45PM
.jpg)
రాహుల్ జాతీయతపై రోజు రోజుకూ వివాదం ముదురుతోంది. రాహుల్ పౌరసత్వంపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు నేతలు. ఇప్పటికే బీజేపీ నేత సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలకు గాను రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నా పౌరసత్వంపై దర్యాప్తు చేయించండి అని మోడీకి సవాల్ విసిరారు. ఇప్పుడు ఇదే విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతురావు కూడా స్పందించి..రాహుల్ గాంధీకి ద్విపౌరసత్వం ఉందంటూ సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఆరోపణలు వాస్తవం కాదని.. సుబ్రహ్మణ్య స్వామి ఒక బ్లాక్ మెయిలర్, శాడిస్ట్ అని మండిపడ్డారు. బీహార్ ఎన్నికల్లో ఓటమిపాలైన బీజేపీ ప్రజల దృష్టి మరల్చేందుకే రాహుల్ పై ఇలాంటి ఆరోపణలు చేస్తుందని అన్నారు. ప్రచారం కోసం ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే ప్రధాని విచారణ కు ఆదేశించాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలు లేవదీయకుండా పక్కదోవ పట్టించేందుకు.. బీజేపీ ఇలాంటి కుట్రలు చేస్తుందని..ఎత్తుగడలు మాని కేంద్రం హుందాగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు.