కోనసీమ జిల్లా కలెక్టర్ కు తృటితో తప్పిన ప్రమాదం

కోనసీమ జిల్లా కలెక్టర్‌ మహేశ్‌కుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. పులిదిండిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పడవ పోటీలు నిర్వహించడానికి చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా  నిర్వహించిన ట్రయల్ రన్ ను కలెక్టర్ ప్రారంభించారు.  ఆ సందర్భంగా ఆయన పొరపాటున కాలువలో పడిపోయారు.  కలెక్టర్ లైఫ్ జాకెట్ ధరించి ఉండటం.. అక్కడే ఉన్న స్విమ్మర్లు వెంటనే అప్రమత్తమై ఆయనను ఒడ్డుకు తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆయనను వేరే పడవలోనికి చేర్చారు. అక్కడే ఉన్న స్విమ్మర్లు వెంటనే స్పందించి కలెక్టర్‌ను రక్షించారు. ఆయనను సురక్షితంగా వేరే పడవలోకి ఎక్కించారు.  

జీపుతో సహా సముద్రంలోకి.. యువకుడి మృతి

అదలా ఉంటే కోనసీమ జిల్లాలోనే న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా అపశ్రుతి చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఇద్దరు యువకులు మద్యం సేవించి జీపులో  సముద్రంలోకి దూసుకెళ్లారు. ఈ ప్రమాదంలో ఒక యువకుడు చాకచక్యంగా ముందే వాహనం నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. మరో యువకుడు సముద్రంలో  గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కాకినాడ నుంచి అంతర్వేది బీచ్ కు గురువారం ముగ్గరు యువకులు వచ్చారు. అంతర్వేదిలోని ఓ రిసార్ట్ లో రూమ్ తీసుకుని పార్టీ   చేసుకున్నారు.

బుధవారం అర్ధరాత్రి పదకొండున్నర గంటల సమయంలో వారిలో ఇద్దరు యువకులు తమ వాహనంలో బీచ్ రోడ్ లో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లి, అన్నాచెల్లెలు గట్టు వద్ద మలుపును గమనించకుండా సముద్రంలోకి వెళ్లిపోయారు. చివరి నిముషంలో జీపులో ఉన్న ఇద్దరిలో ఒకరు బయటకు దూకేసి సురక్షితంగా బయటపడగా, మరో యువకుడు జీపుతో సహా సముద్రంలో గల్లంతయ్యాడు. తరువాత  అతడి మృతదేహం లభ్యమైంది. మృతుడిని శ్రీధర్ గా గుర్తించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu