ప్రజల కోసం మరోసారి పదవీ త్యాగానికైనా సిద్దం : రాజగోపాల్‌రెడ్డి
posted on Aug 5, 2025 5:14PM
.webp)
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం మరోసారి ఎమ్మెల్యే పదవి రాజీనామాకు సిద్ధమని షాకింగ్ కామెంట్స్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాల గ్రామంలో 33/11 కేవి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వేల కోట్లు దోచుకునే వాళ్ళకే పెద్ద పదవులు కావాలి. నేను అందరిలాగా పైరవీలు చేసి దోచుకునే వాడిని అయితే కాదని హాట్ కామెంట్స్ చేశారు.
తనకు మంత్రి పదవి ఇస్తారా? ఇవ్వరా అనేది అధిష్టానం ఇష్టమని ఇంతకంటే దిగజారి బతకలేన్నారు. జూనియర్లకు మంత్రిపదవి ఇచ్చి నన్ను దూరం పెట్టారని రాజగోపాల్‌రెడ్డి వాపోయారు. పార్టీలు మారిన వాళ్లకు పదవులు ఇచ్చి తనలాంటి సీనియర్‌ను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి కాళ్లు మొక్కి పదవులు తెచ్చుకోదలచుకోలేదన్నారు. మనసు చంపుకొని బతకడం తన వల్ల కాదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
పదవి, పైసలు అన్ని వారే తీసుకుపోతున్నారని, కనీసం పదవి లేకున్నా పైసలు మునుగోడుకు రావాలి కదా అని కామెంట్ చేశారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను రాజీపడేది లేదని డిసైడ్ అయ్యానని, మీరు కూడా (ప్రజలు) డిసైడ్ అయ్యారా లేదా అంటూ ప్రశ్నించారు.