సంపూర్ణ తెలంగాణ రాలేదు

 

ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు హైకోర్టు విభజన.. ఉద్యోగులు విభజనపై వివాదం జరుగుతుంది. అయితే ఈ రెండింటిలో తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలే పడ్డాయి. హైకోర్టు విభజన చేయాలంటూ తెలంగాణ వాదులు కోర్టులో ఆరోపించినా ఇప్పట్లో విభజించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. మరోవైపు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులను రిలీవింగ్ చేస్తానంటుంటే మరో వైపు కేంద్రం అలాంటి పప్పులేమి ఉడకవు వాళ్లను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది.

 

ఈనేపథ్యంలో తెలంగాణ న్యాయవాదులు కలిసి హైకోర్టు విభజన కోసం రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయినా ఇంకా సంపూర్ణ తెలంగాణ రాలేదని.. హైకోర్టు, ఉద్యోగుల విభజన కోసం ఆగష్టు 6 తర్వాత ఉద్యమం చేయనున్నట్లు తెలిపారు. అంతేకాదు ఉద్యమం చేసి ప్రత్యేక తెలంగాణ సాధించినట్టు హైకోర్టు కోసం కూడా ఉద్యమం చేయాలని సూచించారు. ప్రత్యేక హైకోర్టు డిమాండ్ ఒక్క న్యాయవాదులకే పరిమితం కారాదాని చెప్పిన ఆయన, ఇందు కోసం తెలంగాణ సమాజం ఉద్యమబాట పట్టాలని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu