12 రోజుల్లో 11.29 కోట్ల మంది పుష్కరస్నానాలు!
posted on Jul 26, 2015 9:05AM
.jpg)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో అత్యంత వైభవంగా నిర్వహించిన గోదావరి పుష్కరాలు నిన్న శనివారం సాయంత్రం హారతి కార్యక్రమంతో ముగిసాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 4.89కోట్లు, తెలంగాణా రాష్ట్రంలో 6.4కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించినట్లు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ మహా పుష్కరాల గురించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ఏర్పాట్లు, ప్రచారం చేయడంతో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా 11.29 కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు చేసారు.
ఈ పుష్కరాలను ఆదిపుష్కరాలు అంటారు. కనుక నేటి నుండి మరొక 12రోజుల పాటు ఉండే అంత్యపుష్కరాల సమయంలో గోదావరిలో పుణ్యస్నానాలు చేసినా అదే ఫలితం ఉంటుందని పండితులు చెపుతున్నారు. ఈ పుష్కరాల రద్దీ సమయంలో పుణ్య స్నానాలు చేయలేక పోయినవారు ఈ 12రోజులలో ఎప్పుడయినా పుణ్యస్నానాలు చేసినా అదే ఫలితం లభిస్తుందని పండితులు చెపుతున్నారు.