హెలికాప్టర్ మనీ సాధ్యం కాదు! కిషన్ రెడ్డి
posted on Apr 24, 2020 2:24PM
తెలంగాణ సీఎం కేసీఆర్ కోరినట్టు హెలికాప్టర్ మనీ అమలు చేయడం సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏదో ఓ రాష్ట్రం కోరితే ఇచ్చేది కాదని... అన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు కలిసితీసుకోవలసిన నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం వుంది హెల్త్ ఎమర్జెన్సీ మాత్రమే. ఆర్థిక ఎమర్జెన్సీ కాదు. ఆ విషయం సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు.
జన సాంద్రత ఎక్కువ ఉన్న దేశాల్లోనే అధిక మరణాలు సంభవిస్తున్నాయి. మనదేశంలో జనసాంద్రత ఎక్కువ కనుక మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఏ రాష్ట్రాల వారు తమ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలను రాష్ట్రాల్లోకి అనుమతించే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఏయే రాష్ట్రంలో ఉన్న ప్రజలు అక్కడే ఉండి సామాజిక దూరం పాటించాలని కిషన్‌రెడ్డి సూచించారు. మర్కజ్ సంఘటన వల్లే దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయని అన్నారు. ముంబైలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
మూడవ విడత లాక్ డౌన్ పొడిగింపు మే 3న ఆ తర్వాతే నిర్ణయం ఉంటుందని వెల్లడించారు.