మంత్రి నోట.. జవాన్ పాట.. 

దేశమును ప్రేముంచుమన్న.. మంచిఅన్నది పెంచుమన్నా .. దేశమంటే మట్టి కాదోయ్  దేశమంటే మనుషులోయ్.. అన్నాడు గురజాడ. కానీ ఇప్పుడు దేశాన్ని ప్రేమించే వారికంటే దేహాన్ని ప్రేమించే వారే ఉన్నారు ..మంచిని పెంచడం కన్నా ముంచే వారే ఉన్నారు..  దేశంలో మట్టి తప్పా మనసున్న మనుషులు మరుగునపడిపోతున్నారు. దేశాన్ని ప్రేమించే వారిలో సైనికులను మించినవారు లేరంటే అందరూ ఒప్పుకొని తీరాల్సిందే .. సైనికుల సేవలకు సెల్యూట్ చేయాల్సిందే .. వారి ఆదర్శాలకు, అంకిత భావానికి భారత దేశపు ప్రజలు ఎప్పటికి బాకీ పడి ఉండకతప్పదు..  

నేను సింగర్ ను కాను.. కానీ భారత సైనికుల కోసం నేను సగర్వంగా పాట పాడుతున్నా అంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పాట మరోసారి దేశాన్ని ప్రేమించమంటుంది .. సైనికుల త్యాగాలను గుర్తించమంటుంది.. ఆన్లైన్లో మంత్రి చేసిన పనిని నెటిజన్లు అందరినీ ఆకట్టుకుంటోంది.. సోషల్ మీడియాలో వ్యూస్, లైకులు, షేర్లు, కామెంట్ల వరద వచ్చిపడుతోంది 100K కామెంట్లు సంపాదించిన ఈ వీడియో వైరల్ అవుతోంది. అధికారిక కార్యక్రమంలో పాల్గొని, పాటపాడిన కేంద్ర మంత్రి సైనికుల్లో ఒకడిగా కలిసిపోవటం సైనిక కుటుంబాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది.. మరోవైపు ఆయనే స్వయంగా ట్విట్టర్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. సరిహద్దుల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించిన ఆయన సైనికులతో భలే కలిసిపోయారు. అంతేకాదు వారితో తాను దిగిన ఫొటోలను కూడా ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇంజినీర్ రెజిమెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ సమావేశంలో రిజిజు పాల్గొని ఇలా సైనికుల్లో నయా జోష్ నింపటం హైలైట్. కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రి కిరణ్ రిజిజు ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ట్విట్టర్‌లో ఎవరైనా ఆయన్ను ఏదైనా అడిగితే తక్షణం స్పందిస్తారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu