ఖమ్మం ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు
posted on Dec 21, 2025 9:59AM

ఖమ్మం జిల్లా రోడ్డు రవాణా కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఏసీబీ ఖమ్మం రేంజ్ అధికారులు ఆర్టీఓ కార్యాలయంలో దాడులు చేపట్టారు. తనిఖీల సమయంలో ఆర్టీఓ కార్యాలయంలో అక్రమంగా కార్యకలాపాలు నిర్వహి స్తున్న 13 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి వివిధ సేవల కోసం దరఖాస్తు దారుల నుంచి వసూలు చేసినట్లు అనుమానిస్తున్న రూ.78,120 లెక్కలేని నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఏజెంట్ల స్వాధీనంలో 837 అసలు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు (RCలు) అసలు డ్రైవింగ్ లైసెన్సులు లభ్యమవడం సంచలనంగా మారింది.
తనిఖీల్లో ఆర్టీఓ కార్యా లయంలోని హాజరు రిజిస్టర్, నగదు రిజిస్టర్ సహా పలు అధికారిక రిజిస్టర్లు సరిగా నిర్వహించబడటం లేదని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, అనధికార ఏజెంట్లు ప్రభుత్వ కార్యాల యానికి సంబంధించిన అసలు పత్రాలను నిర్వహిం చడం తీవ్ర విధానపరమైన ఉల్లంఘనగా పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులు తమ విధులను నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఏసీబీ నిర్ధారించింది.
ఏజెంట్లు స్వేచ్ఛగా పనిచేయడానికి, అసలు పత్రాలు నిర్వహిం చడానికి అనుమతించడం వల్ల అవినీతి పెరిగి, దరఖాస్తుదారులు వేధింపు లకు గురవుతున్నారని అధికారులు అభిప్రాయ పడ్డారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు మరియు ఇందులో పాల్గొన్న ఇతరులపై క్రమశిక్షణా, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి వివరణాత్మక నివేదిక సమర్పించనున్నట్లు ఏసీబీ తెలిపింది.లంచం డిమాండ్ చేస్తే 1064కి ఫోన్ చేయండిప్రజలకు ఏసీబీ విజ్ఞప్తి చేస్తూ,ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని కోరింది.