వైరా బీఆర్ఎస్‌లో అయోమయం.. ఇంచార్జీ లేక క్యాడర్ గందరగోళం

 

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి జోరుగా పావులు కదుపుతున్న బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో మాత్రం అయోమయంలో పడింది. తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ సీపీఐ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి పోటీచేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన  మదన్ లాల్ గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీచేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలతోపాటు ఖమ్మం పార్లమెంట్ స్థానం గెలుచుకున్నారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో మదన్ లాల్ టీఆర్ఎస్ లో చేరారు. దీంతో తనను కాదని మదన్ లాల్ టీఆర్ఎస్ లో పొంగులేటికి నచ్చలేదు.. ఈ నేపథ్యంలో మదన్ లాల్ - శ్రీనివాస్ రెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయి. 

ఆ తరువాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరారు. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి మళ్లీ మదన్ లాల్ కు టీఆర్ఎస్ టికెట్ దక్కింది. మరోవైపు మదన్ లాల్ ను ఎలాగైనా ఓడించాలని పట్టుదలగా పొంగులేటి రాములు నాయక్ ను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపి గెలిపించారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో వర్గపోరు కొనసాగుతోంది.. తిరిగి 2013 ఎన్నికల్లో మళ్లీ మదన్ లాల్ బీఆర్ఎస్ నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి రాందాస్ నాయక్ చేతిలో ఓడిపోయారు.. మదన్ లాల్ ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని బలమైన వర్గం డిమాండ్ చేస్తోంది.. ఈ నేపథ్యంలోనే మదన్ లాల్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఇప్పుడు మళ్లీ ఇంచార్జ్ పదవిపై వర్గపోరు ప్రారంభమైంది.

 త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న తరుణంలో నియోజకవర్గ ఇంచార్జ్ లేకపోవడంతో క్యాడర్ గందరగోళానికి గురవుతోంది. అధిష్ఠానం కూడా వైరా నియోజకవర్గం పై పెద్దగా దృష్టి సారించడం లేదు. జిల్లా పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలు సహజంగా ఆ నియోజకవర్గంలో ప్రతిబింబించేలా ఉన్నాయి. మదన్ సతీమణి తోపాటు మరో ఇద్దరు నేతలు ఇంచార్జ్ పదవికి పోటీపడుతున్నారు.. ఎవరి లాబీయింగ్ వారు చేస్తున్నారు. అధిష్ఠానం మౌనంగా ఉండటంతో నియోజకవర్గంలో గందరగోళం నెలకొంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu