కోటకు సీఎం చంద్రబాబు నివాళులు
posted on Jul 13, 2025 2:07PM
.webp)
ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు పార్థివదేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. హైదరాబాద్‌లో ఫిల్మ్‌నగర్‌లోని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు చాలా బాధాకరమన్నారు. సినీపరిశ్రమకు ఎనలేని సేవలందించారని కొనియాడారు. కోటకు నాకు దగ్గరి సంబంధాలు ఉన్నాయి.
1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీయే కూటమి నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. నటన అంటే ఏవిధంగా ఉండాలో.. 40 ఏళ్ల పాటు నటించి చూపించారన్నారు. . సినిమాలతో పాటు ప్రజాసేవలోనూ కృషి చేశారు. కోటాకు 9 నంది అవార్డులు వచ్చాయని అవార్డులు రావడానికి ఆయన కృషి, ప్రతిభే కారణం. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని చంద్రబాబు తెలిపారు.