ఏపీ ఒక అడుగు ముందుకేస్తే మేం పదడుగులేస్తాం
posted on Jan 9, 2026 5:02PM

జలవివాదాల పరిష్కారంపై తెలంగాణ సీఎం రేవంత్
ఏపీ ముఖ్యమంత్రికి ప్రతిపాదన
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రతిపాదన చేశారు. రెండు రాష్ట్రాల జలవివాదాలను నేరుగా చర్చించుకుని పరిష్కరించు కుందామంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిపాదించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజెన్ మెడికేర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శుక్రవారం (జనవరి 9) ఆయన పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరిం చుకోవాలన్నారు. ఇందు కోసం ఏపీ ఒక అడుగు మందుకు వేస్తే తాము పదడుగులు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
కోర్టుల ద్వారా కాకుండా జల వివాదాలను రాష్ట్రాల మధ్యే పరిష్కరించుకుందాని కోరారు. జల వివాదం విషయంలో రాజకీయ ప్రయోజనం కోసం తాము ప్రయత్నించడం లేదన్నారు. పంచయతీ కావాలా? నీళ్లు కావాలా అంటే తాను నీళ్లు కావాలనే అంటానని స్పష్టం చేశారు. కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు సృష్టించవద్ద కోరారు. తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ ఉండాలంటే పక్క రాష్ట్రం సహకారం తప్పని సరి అన్న రేవంత్ ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యా పరస్పర సహకారం ఉంటేనే సమస్యలు పరిష్కారమౌతాయన్నారు.