తీన్మార్‌ మల్లన్నను వెంటనే అరెస్టు చేయాలి : ఎమ్మెల్సీ కవిత

 

తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ  తీన్మార్‌ మల్లన్నను అరెస్టు చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. తనపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేయడంపై స్పందించిన ఆమె.. మల్లన్న దారుణంగా మాట్లాడారని ఆక్షేపించారు. మల్లన్నను వెంటనే అరెస్ట్ చేయకతే సీఎం రేవంత్, మల్లన్నతో మట్లాడించినట్లేనని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై చర్యలు తీసుకోకపోతే తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిట్లేనని మండిపడ్డారు. తాను మాములు ఆడబిడ్డను కాదని..అగ్గిరవ్వనని కవిత అన్నారు. తనలాంటి వాళ్లను కోట్లలో తయారు చేస్తానన్నారు. 

శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుగోబోమని ఈ సందర్భంగా కవిత స్పష్టం చేశారు. మహిళలు రాజకీయాల్లో మాట్లాడకూడదా అని కవిత ప్రశ్నించారు.ప్రజలపై కాల్పులు జరిపేంత క్రూరత్వం ఏంటి? అని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డను ఇష్టమొచ్చినట్లు మాట్లాడి.. మాండలికం అంటే ఎట్లా? అని కవిత అడిగారు. ఆడబిడ్డలను గౌరవించడం నేర్చుకోండన్న కవిత.. తీన్మార్‌ మల్లన్న నాపై దారుణంగా మాట్లాడారని చెప్పారు. వెంటనే తీన్మార్‌ మల్లన్నను అరెస్ట్‌ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి విచక్షణతో మాట్లాడాలని తీన్మార్ మల్లన్నకు కవిత సలహా ఇచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu