ఓ డ్రగ్స్ బానిస.. ఇద్ద‌రు మోడల్స్ మృతి ఘ‌ట‌న‌.. ఏంటా క్రైం క‌థ‌?

సీన్ ఓపెన్ చేస్తే.. అంద‌మైన కేర‌ళ‌. రాత్రి వేళ‌ హైవేపై ఓ కారు ర‌య్‌న దూసుకుపోతోంది. లాంగ్‌షాట్‌లో కారు లైట్స్ ఫోక‌స్ త‌ప్పా మ‌రేమీ క‌నిపించ‌డం లేదు. కారులోకి జూమ్ ఇన్ చేస్తే.. అందులో ఇద్ద‌రు అంద‌మైన మోడ‌ల్స్‌. వాళ్లు మామూలు మోడ‌ల్స్ అస‌లే కాదు. ఒక‌రు మాజీ మిస్ కేర‌ళ అన్సీ కబీర్‌ (24), ఇంకొక‌రు అదే పోటీలో రన్నరప్ అంజనా షాజన్ (25). వారితో పాటు మ‌రో ఇద్ద‌రు ఫ్రెండ్స్‌. కారును వేగంగా న‌డుపుతున్నాడు ఆ ఫ్రెండ్‌. సైడ్ మిర్ర‌ర్‌లోకి ప‌దే ప‌దే చూస్తూ.. కాస్త కంగారు ప‌డుతున్నారు. వారి కారు వెనుకే మ‌రోకారు త‌మ‌ను ఫాలో అవుతుంద‌ని గుర్తించి.. ఆ కారుకు చిక్క‌కుండా మ‌రింత స్పీడ్ పెంచుతున్నాడు. ఆ ఇద్ద‌రు మోడ‌ల్స్ సైతం వేగంగా పోనీయ్ అంటూ ఆరాట‌ప‌డుతున్నారు. క‌ట్ చేస్తే.. ఆ కారు రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఆ ఘ‌ట‌న‌లో ఆ ఇద్ద‌రు మోడ‌ల్స్ దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. వారి స్నేహితుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. డ్రైవింగ్ చేస్తున్న అత‌ను సీట్ బెల్ట్ పెట్టుకోవ‌డంతో సేఫ్‌. యాక్సిడెంట్ స్పాట్ బీభ‌త్సంగా ఉంది. అక్క‌డితో సీన్ క్లోజ్ అయింది. పోలీసులు స‌మాచారం అందింది. వారు ఇన్వెస్టిగేష‌న్ స్టార్ట్ చేశారు. నెల త‌ర్వాత కానీ.. అస‌లేం జ‌రిగిందో.. కార్ యాక్సిడెంట్ ఎలా, ఎందుకు జ‌రిగిందో.. ఆ కారును వెంబ‌డించిన ఇంకో కారు ఎవ‌రిదో.. అంతా డీటైల్డ్‌గా ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారు కేర‌ళ పోలీసులు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.....

నెల రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేరళ మోడల్స్ మృతిచెందిన ఘటనకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. డ్రగ్స్‌కు బానిసైన సాయిజు థంకచన్‌ అనే వ్యక్తే ఈ కేసులో ప్రధాన నిందితుడని తెలిపారు. అక్టోబర్ 31 రాత్రి జరిగిన కారు ప్రమాదంలో మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్‌ (24), అదే పోటీలో రన్నరప్‌గా నిలిచిన అంజనా షాజన్ (25) దుర్మరణం చెందారు. కోచికి సమీపంలోని వైటిల్లా వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓవ‌ర్ స్పీడ్‌తో ఓ ద్విచక్రవాహనాన్ని తప్పించే ప్ర‌య‌త్నంలో కారు బోల్తా కొట్టింది. ఇంత‌కీ అంత ఓవ‌ర్ స్పీడ్‌గా ఎందుకు వెళ్లాల్సి వ‌చ్చిందంటే... వారి కారును వెంబ‌డించింది ఎవ‌రంటే....

అన్సీ, అంజనా ఫ్రెండ్స్‌తో కలిసి అక్టోబర్ 31న ఒక పార్టీకి వెళ్లారు. అక్కడే డ్ర‌గ్గిస్ట్‌ సాయిజు థంకచన్‌ కూడా ఉన్నాడు. నిందితుడు సాయిజు.. ఆ ఇద్ద‌రు మోడల్స్‌తో అస‌భ్యంగా ప్రవర్తించాడు. రాత్రికి హోట‌ల్ రూమ్ బుక్ చేస్తా.. వ‌స్తారా.. అంటూ వేధించాడు. అందుకు ఒప్పుకోని మోడ‌ల్స్‌.. వారి స్నేహితులతో కలిసి హోటల్‌ నుంచి బయటకు వచ్చేశారు. కారులో ఇళ్లకు వెళ్లిపోతుండగా.. సాయిజు మ‌రో కారులో వారిని వెంబ‌డించాడు. డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి.. సాయిజు కారును గమనించి మ‌రింత వేగంగా కారు నడపడం ప్రారంభించాడు. అదే ప్రమాదానికి కార‌ణ‌మైంది. కారు కంట్రోల్ త‌ప్పి.. బోల్తా ప‌డి.. ముగ్గురి ప్రాణాలు పోయాయని పోలీసులు ప్ర‌క‌టించారు.

ఒమిక్రాన్ మన దగ్గరకు వచ్చేసింది.. మాస్క్ ఉంటేనే బయటికి రండి

అయితే, డ్ర‌గ్స్‌కు బానిసైన సాయిజు థంక‌చ‌న్ ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడంటూ బాధిత కుటుంబ స‌భ్యుల ఆరోప‌ణ‌. ఈ ఘటనలో సాక్ష్యాలను ధ్వంసం చేశారని, హోటల్ యజమాని భయపడుతున్నారని మోడ‌ల్‌ అంజన సోదరుడు అర్జున్‌ ఆరోపించారు. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు మాత్రం త‌మ ప‌ని తాము చేసుకుపోతున్నారు. నిందితుడు సాయిజు థంక‌చ‌న్‌పై కేసు న‌మోదు చేసి.. కోర్టులో హాజరుపర్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu