జగన్ కు బిగ్ షాక్.. తాకట్టులో హోదా.. సారీతో సరా..ఒమిక్రాన్ వచ్చేసింది.. టాప్ న్యూస్@8PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. పంచాయతీ నిధులను డ్రా చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి  కేంద్రం చెక్‌ పెట్టింది. ఆర్థిక సంఘం నిధులు పంపేందుకు ప్రత్యేక అకౌంట్లను పంచాయతీ పేరిట ప్రారంభించాలని కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాలతో అలెర్టయిన పంచాయతీ రాజ్‌ కమీషనర్‌.. జడ్పీ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.--కడప జిల్లాలో వరద బీభత్సానికి గురైన వారి పట్ల సీఎం జగన్ ఉదారంగా స్పందించారు. రాజంపేట మండలం పులపుత్తూరులో పర్యటించిన ఆయన వరద బాధితులతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వరద బాధితులకు ఊరటనిచ్చేలా పలు హామీలు ఇచ్చారు. భారీ వర్షాలు, వరదలతో ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. 
--------
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కోసం ఒక్క పోరాటం అయినా చేసిందా? అని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ప్రశ్నించారు.  ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌పై వైసీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడరని నిలదీశారు. టీఆర్ఎస్‌ ఎంపీల సంఖ్య తక్కువగా ఉన్నా పోరాడుతున్నారని, ఏపీ సమస్యలను వైసీపీ ఎంపీలు ఎందుకు ప్రస్తావించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
---
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదని పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీ భరత్‌ చెప్పారని టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంధ్ర కుమార్ అన్నారు. చంద్రబాబు వల్లే ఈ ఆర్థిక పరిస్థితి అని సభను తప్పుదారి పట్టించారన్నారు. 63 ఏళ్లలో రాష్ట్రానికి రూ. 3 లక్షల 14 వేల కోట్ల అప్పు మాత్రమే ఉందని, జగన్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రూ. 3 లక్షల 8 వేల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు.
---
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పడంపై  సీపీఐ నేత నారాయణ స్పందించారు. అసెంబ్లీ ఘటనపై వంశీ క్షమాపణలు చెప్పడం స్వాగతించదగ్గ విషయమన్నారు. ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారం తీరు అన్యాయం, దురదృష్టకరమన్నారు. కుటుంబ పెద్దగా వ్యవహరించి కంట్రోల్ చేసి ఉండాల్సిందన్నారు నారాయణ. 
-------
తీవ్ర కలకలం రేపుతున్న కోవిడ్ ఒమైక్రాన్ భారత్‌లో ప్రవేశించింది. కర్ణాటకలో ఇద్దరికి ఇది సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఒమైక్రాన్ వేరియంట్ కేసులు రెండు మన దేశంలో నమోదయ్యాయని చెప్పారు. ఈ రెండు కేసులు కర్ణాటకలోనే ఉన్నట్లు తెలిపారు. 46 సంవత్సరాలు, 66 ఏళ్ళు వయసుగల ఇద్దరు పురుషులు ఈ వైరస్ బాధితులని తెలిపారు.
--
తెలంగాణలో ఒమైక్రాన్ వేరియంట్‌ టెన్షన్‌ మొదలైంది. బ్రిటన్‌ నుంచి వచ్చిన ఓ మహిళకు ఒమైక్రాన్ పాజిటివ్‌ వచ్చినట్లు తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె నుంచి శాంపిల్స్‌ సేకరించిన అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపారు. అలాగే ఆ మహిళను టిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. బుధవారం విదేశాల నుంచి వచ్చిన 320 మందికి అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు.
---
తెలంగాణకు చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ ఈరోజు మంత్రి కేటీఆర్ ను ప్రగతిభవన్లో కలిశారు. ఈ సందర్భంగా తన జీవితం ఆధారంగా వచ్చిన "పూర్ణ" పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ కి అందించారు. ఈ సందర్భంగా పూర్ణ ప్రస్థానాన్ని అభినందించిన మంత్రి కేటీఆర్, ఆమె భవిష్యత్ ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు. పూర్ణ భవిష్యత్ ప్రయత్నాలకు సైతం గతంలో మాదిరే ప్రభుత్వం సంపూర్ణ ప్రోత్సాహాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. 
-----
దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసం గుట్టు రట్టు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. లోన్ బజార్, ద లోన్ ఇండియా, ఎస్బీఐ ధనీ బజార్ పేర్లతో నకిలీ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి వందల కోట్ల మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక స్ఫూఫింగ్ యాప్ ద్వారా ఎస్బీఐ అసలైన కస్టమర్ కేర్ నుంచే ఫోన్ వస్తున్నట్టు నమ్మిస్తూ జనాలను వీరు మోసం చేస్తున్నారు.
----
2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమేనని కాంగ్రెస్ సీనియర్ సీనియర్ నేత, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ అజాద్ అన్నారు. 300 ఎంపీ సీట్లను సాధించి కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అధికారాన్ని చేపట్టే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు. 300 సీట్లలో కాంగ్రెస్ గెలుపొందాలని తాను కోరుకుంటున్నానని... అయితే అది సాధ్యమయ్యేలా లేదని చెప్పారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu