దేవాన్ష్‌కు అక్షరాభ్యాసం..తిరుమలలో సందడి వాతావరణం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్‌కు ఇవాళ  అక్షరాభ్యాస వేడుకను నిర్వహించారు. పద్మావతి అతిథి గృహంలో దేవాన్ష్‌కు అక్షరాభ్యాసం చేయించారు. ఈ వేడుకకు నారా, నందమూరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరయ్యారు. అనంతరం కుటుంబ సమేతంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుని మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం అందజేశారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు సీఎం కుటుంబసభ్యులకు ప్రసాదం అందజేసి శాలువాతో సత్కరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu