ఛత్తీస్‌గఢ్‌తో తెలంగాణ విద్యుత్ ఒప్పందం
posted on Nov 3, 2014 2:51PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆదివారం నాడు రాయ్‌పూర్ వెళ్ళిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఒప్పందం కుదిరింది. ఒప్పందం మీద రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ని, మంత్రులను సత్కరించారు. రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఒప్పందం కుదిరిన అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ, ‘‘తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య సంబంధానికి చారిత్రక ప్రాధాన్యం వుంది. కాకతీయ రాజ్యానికి చెందిన ఆనవాళ్ళు ఇంకా ఛత్తీస్‌గఢ్‌లో వున్నాయి. మా పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‌గడ్ సమస్యలను గతంలో ఢిల్లీ స్థాయిలో ప్రస్తావించాం’’ అన్నారు.