సెక్షన్ 8 అవసరం లేదు... కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి రాష్టాల గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యవహారంపై కేసీఆర్, నరసింహన్ భేటీ అయినట్టు సమాచారం. ఈ సందర్భంగా కేసీఆర్ గత సంవత్సరకాలం నుండి హైదరాబాద్ లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదని ఇప్పుడు హైదరాబాద్ సెక్షన్ 8 అమలు అవసరం లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి రెండు రాష్ట్రాల ప్రభుత్వాల అభిప్రాయాలను సేకరించి గవర్నర్ కేంద్రానికి తెలియజేయనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu