బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన రేవంత్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. రేవంత్ రెడ్డితో పాటు నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహలు కూడా బెయిల్ కోసం హోకోర్టులో పిటిషన్ దాఖలు. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలు మొత్తం ఏసీబీ విచారణలో చెప్పానని, చెప్పడానికి ఇంకేం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డికి విధించిన 14 రోజులు కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహాలను ఏసీబీ కోర్టులో హాజరుపరచగా జూన్ 29 వరకు కోర్టు రిమాండ్ పొడిగించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu