కేసీఆర్ మనవడి మిస్సింగ్.. పోలీసులే పట్టుకెళ్లారంటూ ఆరోపణలు!

కే‌సీ‌ఆర్ మనవడు మిస్సింగ్. స్వయంగా కేసీఆర్ మనవడి తల్లి ఈ ఆరోపణ చేశారు. పోలీసులే తన కుమారుడిని అర్ధరాత్రి తీసుకు వెళ్లారనీ, అప్పటి నుంచీ అతడు కనిపించడం లేదనీ ఆరోపించారు. ఔను నిజమే కేసీఆర్ మనవడు రితేష్ కనిపించడం లేదు.

ఈ విషయాన్ని ఆమె తల్లి కేసీఆర్ అన్న కుమార్తె రమ్యారావు తెలిపారు.   రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి పోలీసులు  తన కొడుకు రితేష్ ను తీసుకెళ్లారని, ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడనే విషయాన్ని చెప్పడం లేదని ఆమె ఆరోపించారు.   సిటీ వ్యాప్తంగా గాలించినా తన కుమారుడి ఆచూకీ లభించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అసలు విషయమేమిటంటే రాష్ట్రంలో సమస్యల పరిష్కారం డిమాండ్ తో ఎన్ఎస్ యూఐ అసెంబ్లీ ముట్టడికి పిలుపు నిచ్చింది.

దీంతో పోలీసులు ఎన్ఎస్ యూఐ ముఖ్య నేతలూ, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఆ క్రమంలోనే ఎన్ఎస్ యూఐలో చురుకుగా ఉంటున్న రితేష్ ను కూడా పోలీసులు తీసుకువెళ్లారు. అయితే వాళ్లను ఎక్కడ ఉంచామన్నది కనీసం తల్లిదండ్రులకు కూడా తెలియజేయకుండా పోలీసులు గోప్యంగా ఉంచారు. దీంతో రితేష్ జాడ తెలియడం లేదంటూ రమ్యారావు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం అర్దరాత్రి దాటిన తరువాత పోలీసులు రెండు వాహనాల్లో వచ్చి రితేష్ గురించి ఆరా తీశారని రమ్యారావు చెప్పారు.

ఆ తరువాత రితేష్ గురించి ఇళ్లంతా గాలించారనీ ఆయన లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారనీ, అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ రితేష్ ఆచూకీ తెలియడం లేదని ఆమె ఆరోపిస్తున్నారు. రితేష్ ఆచూకీ కోసం అన్నిపీఎస్ లూ తిరిగినా ఫలితం లేకపోయిందనీ, ఇక్కడికి వెళితే అక్కడా, అక్కడికెళితే అక్కడ అని తిప్పుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.