కేంద్రం పై కేసీఆర్  మరో యుద్ధం ...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’ మళ్ళీ మరోమారు కేంద్రం పై కత్తులు దూశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రామాభివృద్ధి నిధులను నేరగా పంచాయతీలకే పంపించడం, ఏమిటని ప్రశ్నించారు.సమాఖ్య స్పూర్తికి వ్యతిరేకంగా, రాష్ట్రాలను తోసి రాజని కేంద్ర ప్రభుత్వమే పంచాయతీలకు నేరుగా నిధులు పంపించడం చిల్లర వ్యవహరమని, ముఖ్యమంత్రి తమదైన భాషలో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని చీదరించుకున్నారు. అయితే,,ఇది ఇప్పుడు మోడీ ప్రభుత్వం తెచ్చిన విధానం కాదు, ముఖ్యమంత్రే స్వయంగా తమ మాటల్లోనే చెప్పిన విధంగా రాజీవ గాంధీ హయాం నుంచే కేంద్ర నిధుల దుర్వినియోగం పై చర్చ జరుగుతోంది.

ఈ నేపద్యంలోనే రాజీవ గాంధీ, కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల పరిధిలో  గ్రామాలకు పంపే ప్రతి రూపాయిలో 15 పైసలు మాత్రమే నిజమైన లబ్దిదారులకు చేరుతున్నాయని, మిగిలిన 85 పైసలు మధ్య దళారీలు, రాజకీయ బేహారులు, అవినీతికి అలవాటు పడిన అధికారులు, ప్రభుత్వ సిబ్బంది జేబుల్లోకి చేరుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బహుశా ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే కావచ్చును ముఖ్యమంత్రి, రాజీవ గాంధీ మొదలు నేటి ప్రదాని వరకు ఆ పదవిలో ఉన్నవారు ఎవరూ రాష్ట్రాలను నమ్మడం లేదని ఆక్షేపించారు.

‘‘పంచాయతీరాజ్‌ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చిన తర్వాత.. రాష్ట్రాలను నమ్మకుండా, కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చిల్లరగా ఉంది. జవహర్‌ రోజ్‌గార్‌ యోజన, ప్రధాని గ్రామ సడక్‌ యోజన, నరేగా వంటి పథకాలను కూడా కేంద్రమే నేరుగా ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదు’’ అని కేసీఆర్‌ అన్నారు. స్థానిక సమస్యలు రాష్ట్రాలకే తెలుస్తాయని, కానీ.. కేంద్ర పథకాలను నేరుగా ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదని అన్నారు. రోజువారీ కూలీల డబ్బును కూడా ఢిల్లీ నుంచే పంచాలనుకోవడమేంటని ప్రశ్నించారు. 

నిజమే ముఖ్యమంత్రి ప్రస్తావించిన అంశాలు కొంతవరకు నిజమే. స్థానిక సమస్యలు రాష్ట్ర పాలకులకు తెలిసినంతగా ఎక్కడో ఢిల్లీలో కూర్చునే కేంద్ర ప్రభుత్వానికి తెలియవన్న ముఖ్యమంత్రి మాటలలో నిజం వుంది. కానీ, అదే సమయంలో ఒకటికి నాలుగు చేతులు మారడంతో నిధుల దుర్వినియోగంతో పాటుగా అవినీతికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది అనేది కాదనలేని నిజం. నిజానికి, ఈ నిజం వెలుగు చూసిన నేపధ్యంలోనే రాజీవ్ గాంధీ ప్రభుత్వం నిధుల దుర్వినియోగం,అరికట్టేందుకు తీసుకున చర్యల్లో పల్లె నిధులను నేరుగా పంచాయతీలకు పంపాలనే నిర్ణయం తీసుకుందని  పరీశీలకులు గుర్తు చేస్తున్నారు. నిజానికి,  పంచాయతీ నిదుల దుర్వినియోగాన్ని, అవినీతిని దృష్టిలో ఉంచుకునే రాజీవ్ గాంధీ, కేంద్ర పంపే ప్రతి రూపాయిలో 15 పైసలు మాత్రమే నిజమైన లబ్దిదారులకు చేరుతున్నాయని, మిగిలిన 85 పైసలు మది దళారీల జేబుల్లోకి చేరుతున్నాయని, వ్యాఖ్యానించారు.అందుకే, ముఖ్యమంత్రి వ్యాఖ్యల్లో కొంత నిజం ఉన్నా, కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనక అంతకంటే బలమైన కారణమే ఉందని, పరిశీలకులు భావిస్తున్నారు.

అదొకటి అలా ఉంటె, ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంక్షేమ పథకాల విషయంలో, చాలా పెద్దఎత్తున రాజకీయ వివివాదం నడుస్తోంది.ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య అయితే, నిత్య అగ్నిహోత్రంలా వివాదాల అగ్గి రాజుకుంటూనే వుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస మధ్య రాజకీయ  రచ్చకు కారణం అవుతోంది. కేంద్ర పధకాలకు రాష్ట్ర ప్రభుత్వం సొంత పేర్లు తగిలిచి తమవిగా చెప్పుకుంటోందని బీజీపీ ఆరోపిస్తీ, తెరాస నాయకులు రాష్ట్రం కేంద్రానికి ఇచ్చే పన్నులతోనే, దేశం మొత్తం బతికేస్తోందనే అర్థం వచ్చేలా ఎదురు దాడి చేస్తున్నారు.


ముఖ్యంగా మంత్రి కేటీఆర్ ఇటీవల తరచుగా ఎవ‌రి సొమ్ము ఎవ‌రు తింటున్నారంటూ కేంద్రం పై ఘాటు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. కేంద్రానికి తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్ప‌టిదాకా  రూ.3, 65,797 కోట్లు ఇస్తే, కేంద్రం రాష్ట్రానికి తిరిగి ఇచ్చింది కేవ‌లం రూ.1,68,647 కోట్లేన‌ని, త‌న మాట‌ను త‌ప్పుగా నిరూపిస్తే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తానని పదే పదే సవాలు చేస్తున్నారు. మరోవంక, బీజేపీ రాష్ట్ర నాయకులే కాకుండా, కేంద్ర హోమేమంత్రి అమిత్ షా సైతం తీవ్రంగా స్పందించారు.  

ఈ నేపద్యంలో ముఖ్యంత్రి చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయని పరిశీలకులు భావిస్తునారు. హుజురాబాద్ ఓటమి మొదలు కేంద్రపై యుద్ధం ప్రకటించిన ముఖ్యమంత్రి, తాజా అస్త్రం పంచాయతీ ఫండ్స్’ వివాదమని, అంటున్నారు. నిజానికి, కేంద్ర నిధులు నేరుగా పంచాయతీలకు, లబ్దిదారులకు చేరడం వలన నిధుల దుర్వినియోగంతో పాటుగా, అవినీతి కూడా అడుపుఇలోకి వచ్చిందని, నిపుణులు అంగీకరిస్తున్నారు.