ఎన్టీఅర్’కు జై .. కొడుతున్న కేసీఆర్

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరు తారక  రామ రావు,,జయంతి రేపు.(శనివారం) 1923 మే 23 న జన్మిచిన ఎన్టీఅర్, 1996 జనవరి 18 కన్ను మూశారు. అప్పటి నుంచి తెలుగు దేశం పార్టీ, హైదరాబాద్’లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రతి సంవత్సరం ఎన్టీఅర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం కూడా, తెలంగాణ తెలుగు దేశం పార్టీ ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహిస్తోంది. అయితే, ఈ సంవత్సరం వేడుకలకు ఒక ప్రత్యేకత వుంది. ముఖ్యంత్రి కేసీఆర్ జయంతి వేడుకలకు హాజరవుతున్నారు. 

అంతకు ముందు తెలుగు దేశం పార్టీలో ఉన్న రోజుల్లో ఏమో కానీ, తెరాస ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఎప్పుడూ పాల్గొనని, తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా, ఎన్టీఅర్ నివాళులు అర్పించేందుకు, ఎన్టీఆర్ ఘాట్’ వెళుతున్నారు. నిజమే, మీరు విన్నది నిజమే. నిజంగానే ముఖ్యమంత్రి కేసేఆర్, రేపు ( మే 28 శనివారం) పార్టీ ముఖ్యులతో కలసి ఎన్టీఅర్ ఘాట్’కు వెళ్లి పెద్దాయనకు శ్రద్ధాంజలి ఘటిస్తారు.

అయితే, గత 20 ఏళ్లలో  ఏనాడు లేని విధంగా, ముఖ్యమంత్రి కేసీఆర్’కు ఎన్టీఆర్ మీద ఇంత ప్రేమ, ఇంత భక్తి ఒక్క సారిగా ఎందుకు పుట్టుకొచ్చాయి? ఇప్పడు రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా తెరాస వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. అయితే, కేసేఆర్ ఏది చేసినా, ఉచితంగా చేయరు. ప్రయోజనం లేదనుకుంటే మహాత్ముల జయంతి వర్ధంతి వేడుకలనే స్కిప్ చేస్తారు. అలాగే, కేసీఆర్ అనూహ్యంగా ఒక అడుగు వేశారంటే దాని వెనక ఒక రాజకీయ వ్యూహం, ఎత్తుగడ ఉండి తీరతాయి, అనే విషయంలో ఎవరికీ అనుమానం లేదని, అదే విధంగా ఈ నిర్ణయం వెంక కూడా ఎదో వ్యూహం ఉండే ఉంటుందని, పరిశీలకు భావిస్తున్నారు. 

తెలంగాణ ఉద్యమ సమయంలోనే కేసీఆర్, అవసరం అయితే బొంత పురుగును అయినా ముద్దాడతానని ప్రకటించారు.ఇంకొక సందర్భంలో తెలంగాణలో స్థిరపడిన అంద్రోళ్ళ ఓట్ల కోసం, అంద్రోళ్ళ కాలిలో ముళ్ళు దిగితే, తన పంటితో తీస్తానని నమ్మ పలికారు. అంటే అవసరం అయితే, ఎవరిని అయినా సొంతం చేసుకునేదుకు, కేసీఆర్ ఎప్పుడు సిద్దంగా ఉంటారని వేరే చెప్ప నక్కరలేదని అంటారు. అలాగే, అవసరం తీరన తర్వాత అంతే, ‘ప్రేమ’ గా బయటకు గేన్తెస్తారని కూడా అంటారు అనుకోండి, అది వేరే విషయం. 

ఇక ఇప్పడు, ముందస్తు ఎన్నికలకువెళ్ళే ఆలోచనలో ఉన్న కేసీఆర్, అటు ఆంద్ర ఆరిజిన్ ఓటర్లను, ఇటు తెలుగు దేశం పార్టీ నాయకులు, క్యాడర్’ను బుట్టలో వేసుకునేందుకే ఎప్పుడు లేని విధంగా ఇప్పడు ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొంటున్నారనే చర్చ రాజకీయ వర్గాలో జరుగుతోంది. తెలంగాణలో తెలుగు దేశం పార్టీ అంత బలంగా లేక పోయినా, పార్టీకి సుశిక్షితులైన కార్యకర్తలు, బలమైన నాయకులు ఉన్నారు. నిజానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ మంత్రి వర్గంలో సగం మందికి పైగా మంత్రులు అంతా ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు సిశిక్షణలో నాయకులుగా ఎదిగిన మాజే టీడీపీ నాయకులే ఉన్నారు.

అన్నిటినీ మించి బీసీల గుండెల్లో ఈనాటికీ ఎన్టీఅర్ బొమ్మ పదిలంగా వుంది, అందుకే, తెలుగు దేశం పార్టీ నాయకుల నుంచి క్యాడర్, ఓటర్ల వరకు అందరినీ తమ వైపుకు తిప్పుకునే ఎత్తుగడలోభాగంగానే కేసీఆర్, ఎన్టీఆర్ జయంతిని వినియోగించుకునే వ్యూహంతో ఉన్నారని అంటున్నారు. అంతే కాదు, అవసరం అనిపిస్తే, రేపు ఎన్టీఅర్ ఘాట్’నుంచే కేసేఆర్, ఎన్టీఅర్ పేరున ఒక పథకమో మరొకటో ప్రకటించినా ప్రకటిస్తారని, అదే విధంగా, ఎన్టీఆర్’ కు భారత రత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేసినా  చేస్తారని అంటున్నారు.  
నిజానికి, పార్టీలతో సంబంధం లేకుండా పనికొచ్చే, ‘పెద్ద’ లను సొంతం చేసుకోవడం కేసీఆర్ ‘కు కొత్త కాదని అంటున్నారు. జాతీయ స్థాయిలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు శత జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించి పీవీ కుటుంబాన్ని, పీవీ సామాజిక వర్గాన్ని తమ  వైపుకు తిప్పుకున్న చరిత్రను గుర్తు చేస్తున్నారు. పేవీని సొంతంచేస్కోవడమే కాకుండా దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ వరస ఓటముల క్రమంలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలో, పీవీ కుమార్తె, సురభి వాణీ దేవికి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు.  సో.. ఇప్పడు ఎన్టీఅర్ జయంతి వేడుకల్లో పాల్గొనడం కూడా పెద్దాయన మీద ఉన్న గౌరవంతోనో, భక్తితోనో కాదు, రాజకీయ అవసరం కోసమే అంటున్నారు.  

ఆయన అప్పుడు, పీవీని సొంతం చేసుకున్నారు. ఇప్పడు ఎన్టీఅర్’ను సొంతం చేసుకుంటున్నారు. అదే కేసీఆర్ జాతిపిత మహాత్మా గాంధీ, రాజకీయ నిర్మాత బీఆర్ అంబేద్కర్, జయంతి, వర్ధంతి వేడుకలకే ఈ నాడు హాజరు కాని, కేసీఆర్, ఎన్టీఅర్ జయంతి వేడుకల్లో పాల్గొంటున్నారు.అంటే..ఆయన ఎంతటి రాజకీయ చతురుడో వేరే చెప్పనక్కరలేదు. అదే సమయంలో ఆయన్ని ఎన్నికల ఓటమి భయం ఎంతగా వెంతాడుతోందో కూడా .. తెలియచేస్తుందని, పరిశీలకులు అంటున్నారు.