మంత్రుల సామాజిక న్యాయ భేరి సభ నుంచి జనం పరుగో పరుగు

వైసీపీ మంత్రులు సామాజిక న్యాయభేరి పేరిట చేస్తున్న బస్సు యాత్రకు జనం మొహం చాటేస్తున్నారు. గడపకూ మన ప్రభుత్వం అంటూ జనం వద్దకు వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలకు గడప గడపలోనూ నిరసనలు ఎదురైతే ఇప్పుడు సామాజిక న్యాయ భేరి అంటూ 17 మంది చేపట్టిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రకు జనం మొహం చాటేస్తున్నారు.

విజయ నగరంలో జనం లేకపోవడంతో వర్షం నెపం చెప్పి అర్థంతరంగా సభను రద్ధు చేసుకున్న మంత్రులకు రాజమండ్రిలో జనం లేకపోవడంతో మళ్లీ నిరాస తప్ప లేదు.   17 మంది మంత్రులు ప్రభుత్వం పదవులు, సంక్షేమంలో సామాజిక న్యాయం పాటిస్తోందని చెప్పుకోవడానికి వచ్చే సరికే రాజమంహేంద్రవరంలో   సగానికి పైగా జనం వెళ్లిపోయారు. మంత్రులు వచ్చాకా కూడా జనం వెళ్లిపోతుంటే  పాపం పోలీసులు వాళ్లని ఆపడానికి శతధా ప్రయత్నించారు.

సభా ప్రాంగణం  గేట్లు వేసి ఆపాలని చూశారు. అయినా జనం ఆగలేదు. వాళ్లను తోసుకుంటూ వెళ్లిపోయారు. మంత్రులు చివరకు ఖాళీ కుర్చీలకు తాము చెప్పాల్సింది చెప్పుకొని  అక్కడినుంచి కదిలారు.  పథకాలు ఆపేస్తామని డ్వాక్రా మహిళలను,  ఉపాధి పనులు నిలిపివేస్తామని కూలీలను బెదిరించి మంత్రుల బస్సు యాత్ర సభకు తీసుకు వచ్చారు. వారు కూడా చివరకు మంత్రులు వచ్చే సమయానికి వెళ్లిపోయారు. కాగా మంత్రుల బస్సు యాత్ర సభను స్టేడియం గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు. ఈ సభ కోసం ప్రైవేటు బస్సులలో వేల మందిని బలవంతంగా తీసుకు వచ్చినా వారు మంత్రుల ప్రసంగాలను వినడానికి ఇష్టపడలేదు. మంత్రులు వచ్చే సరికే వారు సభా ప్రాంగణం నుంచి బయటకు వెళ్లిపోయారు. పోలీసులు గేట్టు మూసేసి ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇక మంత్రుల బస్సు యాత్ర పేరు చెప్పి రాజమహేంద్రవరంలో పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల ఆంక్షలపై ప్రజలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

అంతకు ముందు విశాఖపట్నంలో  మంత్రుల బస్సు యాత్రు సభకు  డ్వాక్రా మహిళలే ప్రేక్షకులు.   విశాఖ నుంచి  రాజమహేంద్రవరానికి సాయంత్రం నాలుగు గంటలకు మంత్రుల బస్సు చేరుకోవాల్సి ఉండగా   మధ్యాహ్నం రెండుగంటల నుంచే వివిధ బస్సులలో తీసుకొచ్చి మహిళలు, వృద్ధులను కూర్చోపెట్టారు. కానీ 6 గంటలైనా మంత్రుల బస్సు రాకపోవడంతో జనం తిరుగుముఖం పట్టారు. సుమారు రాత్రి 7 గంటలకు మంత్రుల బస్సు వచ్చింది. అప్పటికే సగం జనం వెళ్లిపోయారు.  

జనాన్ని తీసుకొచ్చి ఎందుకు ఇబ్బంది పెడతారని పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. రాజమహేంద్రవరం సభ జన సమీకరణకు మండలానికి 15 ప్రైవేట్‌ బస్సుల వరకూ ఏర్పాటు చేశారు