విభజన బిల్లుపై సుప్రీంకు కావూరి
posted on Feb 18, 2014 6:31PM

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రాజ్యంగా విరుద్దమని, దీనిపైన సుప్రీం కోర్టుకు వెళ్తానని కేంద్రమంత్రి సాంబశివరావు అన్నారు. కోర్ట్ ఈ బిల్లుని కొట్టివేస్తుందని అయన అన్నారు. మరోవైపు విభజన అనంతరం పదేళ్ల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉండనుంది. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలను గవర్నర్‌కు కట్టబెట్టడంపై తాను సుప్రీం కోర్టుకు వెళ్తానని మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
తెలంగాణ విషయంలో భారతీయ జనతా పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభించిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ అన్నారు. తెలంగాణ బిల్లును వెంటనే రాజ్యసభకు తీసుకొస్తామన్నారు. లోకసభలో విభజన బిల్లుకు మొత్తం 38 సవరణలు ఆమోదం పొందాయని తెలిపారు.