పురందేశ్వరి దంపతులు కాంగ్రెస్ కి గుడ్ బై
posted on Feb 18, 2014 8:49PM
.jpg)
రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఈ రోజు చాలా మంది మంత్రులు, శాసనసభ్యులు తమ పదవులకు, కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామాలు చేసారు. అందులో ప్రముఖంగా పేర్కొనవలసిన వారు కేంద్రమంత్రి పురందేశ్వరి, మంత్రులు గంటా శ్రీనివాసరావు, పార్ధ సారధి, ఏరాసు ప్రతాప రెడ్డి, టీజీ వెంకటేష్ ఉన్నారు. ఇంకా శాసనసభ్యులలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, యూవీ రమణ మూర్తి (యలమంచిలి), షాజహాన్ బాష (మదనపల్లి), రమేష్ బాబు( పెందుర్తి, వైజాగ్); రామారావు (తెదేపా-కొవ్వూరు) శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా మరికొందరు కూడా రేపు రాజీనామా చేయనున్నారు. అయితే అందరికంటే ముందుగా రాజీనామా చేస్తారనుకొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఇంకా ఎప్పుడు రాజీనామా చేస్తారో తెలియలేదు. బహుశః రేపు ఉద్యమ 10.30గంటలకు మీడియా సమావేశం నిర్వహించిన తరువాత రాజీనామా చేయవచ్చని సమాచారం. ఆయనతో బాటు కనీసం పాతిక మంది శాసనసభ్యులు రాజీనామాలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రేపటితో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ దాదాపు సగంపైగా ఖాళీ అయిపోవచ్చును. విజయవాడ యంపీ లగడపాటి రాజగోపాల్ తను రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం దీనికి సిద్దపడే ముందుకు వెళ్ళింది గనుక పెద్దగా చింతించకపోవచ్చును. అదేవిధంగా ఇప్పుడు వీరందరూ రాజీనామాలు చేసినందున కొత్తగా ఒరిగేదేమీ ఉండదు.
బహుశః రేపటి నుండి బొత్ససత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పుతారేమో.ఇంట్లో శవం లేచి లేస్తే ఒకళేడుస్తుంటే, పోనీలే మంచం ఖాళీ అయిందని మరొకరు సంతోషించినట్లుంది ఆయన పని.