కావూరిని హెచ్చరించిన సమైక్యాంధ్ర జెఎసి

 

KAVURI ON TELANGANA, KAVURI congress, TELANGANA issue

 

 

కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఈ రోజు తెలంగాణ పై చేసిన వ్యాఖల మీద సమైక్యాంధ్ర విద్యార్ధి జెఎసి నేతలు మండిపడుతున్నారు. కావూరి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్ధి జెఎసి నేతలు డిమాండ్ చేశారు. కావూరి వైఖరి మార్చుకోకపోతే అడుగడుగా నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వచ్చే నెలలో సమైకాంద్ర కోసం ప్రత్యేక రథాన్ని ఏర్పాటు చేసి పర్యటిస్తామని తెలిపారు.

 

మరోవైపు ఈరోజు ఉదయం తెలంగాణ అంశంపై అధిష్టాం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలలో రాజీపడక తప్పదన్నారు. కేంద్ర మంత్రిని అయ్యాక ఇంకా గ్రామ సర్పంచ్ స్థాయిలో ఆలోచించలేమని ఆయన తెలిపారు. పార్టీ నాయకత్వం బలపడాల్సిన అవసరం ఉందని కావూరి సాంబశివరావు పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu