ఈయన దేన్నీ వదలడు...

 

కొంతమంది మంచి పనులని చాలా సైలెంట్ గా చేసుకు వెళ్తుంటారు . మరికొంతమంది ఏమి చేయక పోయినా ఎదో చేస్తున్నట్టు , సమాజ పరిరక్షణ వాళ్ళ బుజాల మీద వున్నట్టు ఫీల్ అయిపోతూ అటు అమలాపురం నుంచి ఇటు అమెరికా వరకు ఏ చిన్న వివాదం కనిపించినా అందులో వేలు , కాలు , పెట్టి ఎంతో కొంత పబ్లిసిటీ సంపాదించుకోవాలని ప్రయిత్నిస్తుంటారు . ఈ మధ్య ఆలా పబ్లిసిటీ కి వెంపర్లాడే జనాలకి మీడియా కూడా తోడయ్యి చిన్న చిన్న విషయాలు కూడా విపరీతమైన పబ్లిసిటీ ని సంపాదించు కుంటున్నాయి .

 

అసలు ఆ విషయం కి సమాజం లో జనాలకి ఎంత కనెక్షన్ వుంది అన్న విషయం తో సంబంధం లేకుండా ఒక వార్త ఛానల్ లో ఆ విషయం కోసం ప్రస్తావన వస్తే చాలు మిగితా చానల్స్ అన్ని ఆ విషయాన్నీ లాగి పీకి కావలసినంత హంగామా చేస్తుంటాయి . అలా ఇప్పటి సీజన్ లో హాట్ టాపిక్ కౌసల్ ఆర్మీ . అసలు ఆ ఆర్మీ ఏంటి, దాని లక్ష్యాలు ఏంటి , ఇంతా చేసి పరిరక్షించేది ఎవరిని ? ఇలాంటి ప్రశ్నలు ఎదురైతే సమాదానం లేదు . ఒక వ్యక్తి కోసం ఇంతమంది పాకులడుతున్నారు చూసారా ? అంటూబీరాలు పోయే వాళ్ళకి సోషల్ మీడియా లో కొదవే లేదు . అయితే అంతే స్తాయిలో ఈ హంగామా నంతా చూసి విసుక్కుంటున్న వాళ్ళు లేకపోలేదు .

 

రోజుకో వివాదం , రోజుకో ఆరోపణలు , దాడులు , ప్రతి దాడులు , చూస్తుంటే జనాలకి ఇంత కాళి సమయం ఉందా అన్న ఆశ్చర్యం కలుగుతోంది అన్నారు మొన్నే ఈ మద్య ఎవరో .. సరే ఇదంతా పక్కన పెడితే ఈ విషయం మీద ఇప్పటి దాకా అందరూ స్పందించారు ..మరి ఆయన వదులుతాడ ? అసలే ఏ చిన్న విషయాన్నీ వదలని గుణం ఆయనిది . ఏ చిన్న దారం దొరుకుతుందా మీడియా లో వినిపించి , కనిపించి పాపులారిటీ సంపాదించాలి అని చూస్తుంటాడు . ఈ జరిగేదంతా కరక్ట్ కాదు , నాకు నచ్చ లేదు అంటూ తన అభిప్రాయాన్ని గట్టిగా వినిపించారు కత్తి మహేష్ గారు . ఇంకా కొంచం ఆవేశం కూడా పడ్డారు అనుకోండి. మరి ఈయన ఆవేశం చూసి , ఈయన చెప్పిన మంచి మాటలు విని ఆ ఆర్మీ తన గొడవ ఆపెస్తుందేమో ? రేపటి నుంచి మీడియా కి ఫిల్లర్ న్యూస్ ఎలాగో ఏంటో?