చెట్లపెంపకమే కరీముల్లా జీవితం
posted on Jul 20, 2022 11:09AM
చెట్లు పెంచడం సరదాగా మారింది ఈ రోజుల్లో. చెట్లు పెంచడం పిల్లల్ని పెంచడంతో సమానంగా భావిం చేవారు పూర్వీకులు. కలీముల్లా తెల్లారుతూనే లేచి సుమారు మైలు దూరంలో వున్న పెద్ద మామిడి చెట్టు దగ్గరికి వెళుతూంటాడు. ఇది ఆయన నిత్యకృత్యం. 82 ఏళ్ల పెద్దాయన ఎందుకంతగా అవస్తపడుతున్నా డని అందరూ అనుకుంటూంటారు. కానీ 120 ఏళ్లనాటి ఆ మామిడి చెట్టంటే ఆయనకు ప్రాణ సమానం. పరుగున వెళ్లి మాను తాకి, ఆకులతో మాట్లాడి, ఆ గాలిని పీలిస్తేగాని ఆయనకు తాను ఇంకా బతికే ఉన్నా నని అనిపించదట! మామిడికాయలకు ఆయన సచిన్ అని, ఐశ్వర్య అనీ పేర్లు పెట్టుకున్నారు!
ఎవరన్నా అడిగితే ఇది మీకు కేవలం చెట్టే కానీ ఏళ్లతరబడి కష్టానికి ఫలం. దీన్ని కేవలం చెట్టుగా చూస్తే అలానే కనపడుతుంది. కల్పవృక్షంలా చూస్తే అనేక రకాల మామిడిపళ్ల నిలయంగా కనపడుతుంది అంటారాయన. బడికి ఏనాడూ వెళ్లని కరీముల్లా బాల్యంలోనే చెట్లు నాటడం, పెంచడం మీద మక్కువ ఏర్పడి అదే జీవితంగా మార్చుకున్నారంటే ఒక్కింత ఆశ్చర్యమే. ఇలాంటివారివల్లనే పర్యావరణ స్పృహ అంటూ జనాలకి కలుగుతోంది. 1987 నుంచీ అనేక రకాల మామిడి పండ్లు అందించడంలో ప్రసిద్ధుడ య్యారు. దీనికి తోడు వాటికి విచిత్రమైన పేర్లూ పెడుతూ జనాన్ని బాగా ఆకట్టుకున్నారు కరీముల్లా.
30 అడుగుల ఎత్తు, విశాలమైన కొమ్మలతో ఎంతో చల్లని నీడనిస్తూండే చెట్లు ఏవయినా తల్లిలాంటివే అన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. అదే ఆయన తెలిసినవారందరికీ ప్రచారం చేస్తున్నది. ఆయనకు కాస్తంత సినిమా, క్రికెట్ పిచ్చి కూడా ఉందని వాళ్లబ్బాయి అంటూంటాడు. అందుకనే అనేక రకాలకు ఐశ్వర్యారాయ్, మోదీ, సచిన్ టెండూల్కర్, అనార్కలీ వంటి పేర్లు పెట్టారు. ఇప్పటికీ అన్ని ప్రాంతాల వారినీ అవి ఆకట్టుకుంటున్నాయి. చేతి వేళ్లలానే పండ్లు వేటికవే ప్రత్యేక రుచి అంటారాయన. చెట్లను పెంచడంలో ఆయన ప్రత్యేకలకు చాలామంది ఫిదా అయ్యారు. చెట్లు పెంచడం అంటే మొక్కలుగా ఉన్నపుడు నీళ్లు పోయడం, కాస్తంత జాగ్రత్తలు తీసుకోవడమే కాదు వాటిని కన్నబిడ్డల్లా చూసుకుంటూం డాలి అనే సిద్ధాంతానికి కరీముల్లా కట్టుబడి ఉన్నారు. అందుకే ఆయన కృషిని లోకం గుర్తించింది. యుఏ ఇ నుంచి కూడా ఆయనకు ఆహ్వానం అందింది. 2008లో భారత దేశ అత్యంత ఉన్నత సౌర సత్కారం పొందారు. ఎడారిలో సైతం మామిడి చెట్లను పెంచగలనన్నది ఆయన ధీమా.
పంట పాడవుతోంది, వాతావరణంలో వచ్చే మార్పులతో ఆశించినంత పంట అందటం లేదనే రైతాంగం మాటల్ని కరీముల్లా అస్సలు పట్టించుకోరు. పంటకు కావలసినది నాణ్యమైన ఎరువులు, గింజ తప్ప వాతావరణ మార్పులతో ఎలాంటి సమస్యా వుండదన్నది ఆయన అభిప్రాయం. భారీ నష్టాలు వస్తున్నా యని గోడుపెడుతూండే రైతులు చాలామంది తక్కువలో వస్తున్నాయని, నాణ్యత లేని ఎరువులు, గింజ లు వాడుతుండడం వల్లనే ఏ పంటయినా దెబ్బతింటుంది. దానికి పర్యావరణానికి అస్సలు సంబంధం లేదని కరీముల్లా అంటున్నారు.