వరద సాయంలోనూ అవకతవకలేనా..?
posted on Jul 20, 2022 10:55AM
బాధితులను ఆదుకోమని బియ్యం మూటలు పంపిస్తే బావమరిది దారి మళ్లించి ఇంటికి చేర్చాడనే మాట విన పడుతూంటుంది. ముఖ్యంగా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలోనే. అసలే గూడు, తిండి గింజలు, దుస్తులూ పోయి, బతుకు జీవుడా అని శిబిరాల్లో ఉండేవారి పట్ల దయతో, ప్రేమతో వారి అవసరాలకు కావలసిన వస్తువులను సర్దుబాటు చేయాలి. ఇది ఏ ప్రభుత్వమయినా చేస్తుంది. చేయాలి. కానీ ఇందులో కూడా అస్మదీయులు, తస్మదీయులు అని గీత గీసుకుంటే దానికంటే దారుణం మరోటి ఉండదు. అసలు బాధితులకు అందాల్సినవి వేరే వారికి చేరేస్తే అంతకన్నా దుర్మార్గం మరోటి ఉండదు.
గోదావరి వరద బాధితులకు రాష్ట్ర సర్కారు పదివేల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటిం చింది. ఈ పరిహారం అందు కునే అర్హులు ఎవరన్న జాబితా తయారీలో అధికారులు నిమగ్నమయ్యా రు. అయితే పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన వారినే అర్హులుగా పరిగణిస్తున్నారని.. స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఉన్న బాధితులను పరిగణనలోకి తీసుకోవడం లేదని, పైగా వరద బాధితులు కాని వారి పేర్లనూ జాబితాలో చేరుస్తున్నారంటూ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాచలంలోని ఆర్యవైశ్య సత్రంలో వరద బాధితుల పేర్లు నమోదు చేస్తున్నారని తెలిసి.. అక్కడికి బాధి తులు పెద్ద సంఖ్యలో వెళ్లారు. తమ పేర్లు రాయాలంటూ ఒత్తిడి తేవడంతో సిబ్బంది అక్కడి నుంచి వెళ్లి పోయారు. అనంతరం పోలీసుల సాయంతో తహసీల్దార్ జాబితా సేకరణ ప్రక్రియను చేపట్టా రు. అలాగే భద్రాచలం నన్నపనేని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల పునరావాస కేంద్రం, మణుగూరులోని కేంద్రంలో కూడా బాధితులు ధర్నా చేపట్టారు. బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర గ్రామంలో ఏర్పాటు చేసి న పునారావాస కేంద్రాన్ని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సందర్శించారు.
ఈ క్రమంలో పరిహారం సర్వేలో అక్రమాలు జరుగుతున్నాయని, తమ లాంటి అసలైన బాధితులకు అన్యాయం జరుగుతోందంటూ భాదితులు ఆయనను చుట్టు ముట్టారు. సర్వే చేసే అధికారులు పేర్ల నమో దులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్‌కు వివరించారు. భద్రాద్రి ముంపు ప్రాంతాల్లో రెండు రోజు లుగా బియ్యంతో పాటు నిత్యవసర సామగ్రిని పంపిణీ చేస్తుండగా కొందరికి సన్నబియ్యం, మరికొందరికి దొడ్డు బియ్యం వస్తున్నాయంటూ బాధితులు నిరసన తెలిపారు. బాధితులందరికి సన్నబియ్యమే ఇవ్వా లని డిమాండ్ చేశారు. అన్నారం గ్రామానికి చెందిన కొందరు మహిళలు తమకు బియ్యం అందడం లేదని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.