పెళ్లి అయితేనేం..?
posted on Sep 14, 2013 8:08PM

కరీనా కపూర్ బాలీవుడ్ సినీ అభిమానులకు ఆరాధ్య దేవత. వరుస సక్సెస్ బాలీవుడ్ టాప్ క్వీన్‌గా ఓ వెలుగు వెలుగిన టాప్ హీరోయిన్. అయితే పెళ్లి చేసుకొని తన అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లేసిన ఈ హాట్ ఇప్పుడు మళ్లీ తన ఫ్యాన్స్ కోసం ఓ హాట్ ఆఫర్ ఇస్తుంది.
పెళ్లి తో తన ప్రొఫషనల్ లైఫ్‌కు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదని తేల్చి చెప్పిన కరీనా, ఇప్పుడు కూడా స్క్రీన్ డిమాండ్ చేస్తే తను హాట్ సీన్లకు రెడీ అని ప్రకటించేసింది. అయితే ఇన్నాళ్లు ఆంటీ అయిన కరీనాకు హాట్ ఆఫర్స్ ఎలా ఇవ్వాలని సతమతమవుతున్న దర్శక నిర్మాతలకు వెల్ కం చెప్పేసింది కరీనా.
సత్యాగ్రహ సినిమాలో తాను లిప్‌లాక్ సీన్‌కు అంగీకరించకపోవడానికి కారణం వేరే ఉందన్న కరీనా, అది ఓ సోషల్ ఎవేర్‌నెస్ మూవీ అందుకే ఆ సినిమాకు ఆ సీన్ అవసరం లేదని తాను భావించానని నిజంగా స్క్రీప్ట్ డిమాండ్ చేస్తే ఎలాంటి సీన్ చేయడానికైనా తాను రెడీ అని చెప్పేసింది. ఈ స్టేట్‌మెంట్‌తో మరోసారి కరీనా శఖం స్టార్ట్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్.