కాళేశ్వర్ మృతిపై హైకోర్టులో రిట్?

పెనుగొండకు చెందిన సాయి కాళేశ్వర్ మృతిపై హైకోర్టులో కొందరు న్యాయవాదులు రిట్ వేయబోతున్నట్లు తెలుస్తోంది. హైకోర్టుకు చెందిన ఈ న్యాయవాదులు గతంలో ప్రతిఏటా సాయికాళేశ్వర్ ను దర్శించుకునే వారు. కాళేశ్వర్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపై విచారణకు ఆదేశించ వలసిందిగా హైకోర్టును వీరు కోరబోతున్నట్లు తెలిసింది. న్యాయవాదుల బృదంలో ఒకరైన కరుణాకర్ తెలుగువన్.కామ్ తో మాట్లాడుతూ కాళేశ్వర్ ది హత్య లేక ఏదైనా వ్యాధితో చనిపోయారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కాళేశ్వర్ పెనుగొండ తదితర ప్రాంతాల్లో సుమారు 3000 కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉన్నాయని, అవి ఇప్పుడు ఏమయ్యాయో తెలియడం లేదని అన్నారు. ఇదిలా ఉండగా హైకోర్టు న్యాయవాది కరుణాకర్ కాళేశ్వర్ సమాధికి పూలదండలు వేయడానికి వెళ్ళబోతుండగా ఆశ్రమవర్గాలు అటకాయించాయి. దీంతో అక్కడ కొద్దిసేపు కరుణాకర్ ఆశ్రమ ప్రతినిథుల మధ్య వాగ్వాదం జరిగింది.

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu