కేసీఆర్ కు ఉన్నతాధికారి ఝలక్
posted on Jul 18, 2015 3:09PM

తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఓ ముఖ్య కార్యదర్శి వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్నే కాదన్న ఆ అధికారి ఎవరనుకుంటున్నారా.. ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా. వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈవో తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) మేనేజింగ్ డైరెక్టర్ పోస్టులు చాలా కాలం నుంచి ఖాళీగా ఉన్నాయి. అయితే సీఎం కేసీఆర్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవోగా గాంధీ ఆస్పత్రి పనిచేస్తున్న ప్రొఫెసర్ చంద్రశేఖర్‌ను నియమిస్తూ నాలుగు క్రితమే దానికి సంబంధించిన ఫైల్ మీద సంతకాలు కూడా పెట్టారు. అయితే ఈ ఫైల్ వైద్య శాఖ ముఖ్యకార్యదర్శి అయినటువంటి సురేష్ చందా దగ్గరకి వచ్చింది. అయితే సురేష్ చందా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆరోగ్యశ్రీకి ఐఏఎస్ స్థాయి అధికారే సీఈవోగా ఉండాలని.. మొదటి నుండి ఈ ట్రస్టుకు ఐఏఎస్ అధికారులే సీఈవో గా వ్యవహరిస్తున్నారని.. ఈ పోస్టుకు ఐఏఎస్ పేరును పరిశీలించాల్సిందిగా అభిప్రాయాన్ని ఫైల్‌లో వ్యక్తం చేస్తూ ఫైల్‌ను తిరిగి పంపించారు.