హైవేల పక్కన రిసెప్షన్ సెంటర్లు.. చంద్రబాబు

 

గోదావరి మహా పుష్కరాలు ఐదు రోజు కూడా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పుష్కరాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు భద్రతా ఏర్పాట్లు.. భక్తుల సౌకర్యాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం హైవేల పక్కన రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని.. అంతేకాదు వారికి అక్కడ.. మంచినీరు, మజ్జిగ వంటివి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. టోల్‌ ఫ్రీల దగ్గర పుష్కరాలకు వచ్చే భక్తుల నుండి ఫీజు వసూలు చేయవద్దని.. రాజమండ్రిలో 300 సిటీ బస్సులకు వెహికల్‌ ట్రాకింగ్‌ సిస్టం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పుష్కరాల్లో కష్టపడి పనిచేసిన ఉద్యోగులకు ఈనెల 26న అవార్డులు ఇస్తామని సీఎం ప్రకటించారు. రోజులో 22 గంటల పాటు పుష్కరస్నానాలకు అవకాశం ఉందని తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu