'హిమ్మత్ వాలా' ఫట్: తమన్నా కు బ్యాడ్ టైమ్

 

 

 Tamanna Himmatwala, himmatwala movie talk, Himmatwala Movie,  Tamanna  ajay devgan

 

 

మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ లో చేస్తున్న లేటెస్ట్ మూవీ 'హిమ్మత్ వాలా'. ఈ సినిమా విడుదలకు ముందు తమన్నా అందాన్ని అందరూ తెగ పొగిడేశారు. కాని సినిమా రిలీజ్ తరువాత మ్యాటర్ మొత్తం రివర్స్ అయ్యింది. ఎన్నో అంచనాలతో విడుదలైన 'హిమ్మత్ వాలా' కి నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. ఒరిజినల్ సినిమాలో శ్రీదేవి తన నటనతో అదరగొట్టగా, తమన్నాకు మాత్రం ఈ విషయంలో జీరో మార్కులే పడ్డాయి. డాన్సులు బాగానే చేసిన..నటనలో మాత్రం ఆమె ఏ మాత్రం భావాలు పలికించలేదని టాక్.


డైరెక్టర్ సాజిద్ ఖాన్ సినిమా రీమేక్ చేయడంలో తడబడ్డట్టు సమాచారం. సినిమాను చాలా స్లోగా నడిపించి ఆడియన్స్ కు బోర్ కొట్టించాడని టాక్. హిట్ ఫిల్మ్ ను రీమేక్ చేసేటప్పుడు ఇంకా బెటర్ గా చేసే ప్రయత్నంలో తప్పులే ఎక్కువయ్యాయి. బాలీవుడ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తమన్నా ను  'హిమ్మత్ వాలా' ఆదుకోలేకపోయాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu