ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి
posted on Aug 19, 2025 1:33PM

ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థిగా మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఖారరు చేసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం (ఆగస్టు 19) ప్రకటించారు. సుదర్శన్ రెడ్డి గతంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా కూడా పని చేశారు. తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి 1971లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా చేరారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 1988-90 మధ్యకాలంలో హైకోర్టులో ప్రభుత్వ ప్రభుత్వ న్యాయవాదిగా పని చేశారు. 1990లో కొంత కాలం పాటు కేంద్ర ప్రభుత్వానికి అదనపు స్టాండింగ్ కౌన్సె ల్‌గా కూడా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి లీగల్ అడ్వైజర్, స్టాండింగ్ కౌన్సెల్‌గా కూడా పని చేశారు. పనిచేశారు.1995 మేలో ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమి తులయ్యారు. అంతే కాదు గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పని చేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా కూడా పని చేసిన బి. సుదర్శన్ రెడ్డి 2011లో పదవీ విరమణ చేశారు.