న్యాయవ్యవస్థపై ఉద్దేశపూర్వక దాడులు.. రక్షించుకోవాల‌న్న జ‌స్టిస్ ర‌మ‌ణ‌..

న్యాయవ్యవస్థను పరిరక్షించడంలో న్యాయమూర్తులకు న్యాయవాదులు సహకరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కోరారు. ఉద్దేశపూర్వక దాడుల నుంచి న్యాయవ్యవస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత న్యాయవాదులదే అని తెలిపారు. నిజం వైపు నిర్భయంగా నిలబడటం సహా తప్పును అంతే స్థాయిలో ఖండించాలన్నారు. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 

న్యాయవ్యవస్థ అనే కుటుంబంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు సభ్యులని సీజే ర‌మ‌ణ‌ అన్నారు.  ప్రజా సంక్షేమమే రాజ్యాంగ మూలసూత్రమని.. న్యాయవాద వృత్తి చాలా పవిత్రమైనదని గుర్తు చేశారు. రాజ్యాంగ మూల సూత్రాలు అర్థం చేసుకొని ముందుకు వెళ్లేలా ప్రతిజ్ఞ చేద్దామని సూచించారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu