తెలంగాణ కొత్త సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్
posted on Jul 14, 2025 8:14PM

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు.ఈ మేరకు కొలీజియం సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కాగా, ఇంతకు ముందు త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ పనిచేశారు. ఇక ప్రస్తుత తెలంగాణ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా ఉన్న సుజయ్ పాల్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలిజియం సిఫార్సు చేసింది.
ప్రస్తుతం త్రిపుర హైకోర్టు సీజేగా సేవలందిస్తున్న ఆయన బదిలీపై తెలంగాణ హైకోర్టుకు వచ్చారు. అపరేష్ కుమార్ సింగ్ (ఏకే సింగ్) 1965, జూలై 7న జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. అనంతరం 1990 నుంచి 2000 వరకూ యూపీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఆ తర్వాత 2001లో జార్ఖండ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2012, జనవరి 24న జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.