జూబ్లీ బైపోల్ కౌంటింగ్ షురూ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైంది.  సుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో  ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 14) ఉదయం ఎనిమిది గంటలకు షురూ అయ్యింది. నియోజకవర్గ పరిధిలోని  407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కించడానికి 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 186 మంది సిబ్బంది ఈ కౌంటింగ్‌లో  పాల్గొన్నారు. జూబ్లీ బైపోల్ లో 48.49శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.  అత్యధికంగా బోరబండ డివిజన్ లో 55.92 శాతం పోలింగ్ జరిగితే.. అత్యల్పంగా  సోమాజిగూడలో 41.99 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక కౌంటింగ్ విషయానికి వస్తే.. ఈ ప్రక్రియను మొత్తం పది రౌండ్లలో పూర్తి చేయనున్నారు. గంట సేపటిలోగా ట్రెండ్స్ తెలిసే అవకాశం ఉండగా, మధ్యాహ్నం రెండు గంటలకల్లా తుది ఫలితం వెల్లడౌతుందని అంచనా.  

ఇలా ఉండగా ఈ ఉప ఎన్నికలో పోటీలో ఉన్న అభ్యర్థులు కౌంటింగ్ సెంటర్ కు చేరుకున్నారు.  పోటీలో మొత్తం 58 మంది అభ్యర్థులు  ఉన్నప్పటికీ.. ప్రధాన పోరు మాత్రం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్యే ఉంది.  కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత రంగంలో ఉన్న సంగతి విదితమే. బీజేపీ నుంచి దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu