బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. ఓట్ల లెక్కింపు ప్రారంభం

బీహార్  అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. శుక్రవారం (నవంబర్ 14) ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ లో ముందుగా బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తున్నారు. కాగా రెండు విడతలుగా జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో రెండు విడతలలోనూ కూడా భారీ ఓటింగ్ నమోదైంది.

అత్యధిక ఓటింగ్ తమకే అనుకూలమని ఈ ఎన్నికలలో హోరాహోరీగా తలపడిన మహాఘట్ బంధన్, ఎన్డీయే కూటములు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు దశల్లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.  తొలి దశలో 121 సీట్లకు, మలి దశలో 122 సీట్లకు పోలింగ్ జరిగింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu