బిజెపిలో చేరికలు నిల్

భారతీయ జనతా పార్టీకి క్రమశిక్షణ పార్టీ అని పేరు గడించింది. వాక్ స్వాతంత్రానికి ఆ పార్టీలో నూకలు చెల్లు అనే టాక్ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎవరు ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా విమర్శించవచ్చు. వాళ్ల మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం అత్యంత అరుదు. 
కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెరుగుతుండగా బిజెపిలో కొత్తగా చేరికలు ఉండడం లేదు. ఉన్నవారినే కాపాడుకోవడం గగనమైంది కెసీఆర్ కూతురు కల్వ కుంట్ల కవితను అరెస్ట్ చేస్తే తమ పార్టీ అధికారంలో రావడం నేత కల్ల అని చేవెళ్ల మాజీ ఎంపీ, బిజెపి నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చేశారు. కర్ణాటక ఎన్నికల  ప్రచార సమయంలో బిఆర్ ఎస్ మూడోసారి అధికారంలో రాదని తమ పార్టీ మాత్రమే అధికారంలో రాగలుగుతుందని బిజెపి నేతలు గొప్పగా చెప్పేవారు. కానీ కర్ణాటక ఫలితాల తర్వాత బిజెపి పరాజయంతో తెలంగాణ బిజెపి నేతలు జోరు తగ్గించారు. కవితను అరెస్ట్ చేస్తేనే తెలంగాణలో బిజెపి అధికారంలో రాగలుగుతుందని ప్రచారం చేస్తున్నారు. బిజెపి జాతీయ నేత ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  తెలంగాణలో 40 మంది బిజెపి అభ్యర్థులు దొరకడమే గగనమన్నారు.  మా పార్టీకి అభ్యర్థులు కరవయ్యారు అని సంచలన కామెంట్ చేశారు. అతనిపై ఇప్పటి వరకు పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. గతంలో ఇంద్ర సేనారెడ్డి చేరికల కమిటీలో ఉండి చేరికలను ప్రోత్సహించారు. ప్రస్తుతం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేరికల కమిటీకి సారథ్యం వహిస్తున్నారు. గమ్మత్తు అయిన విషయం ఏమిటంటే చేరికల కమిటీ చైర్మన్ హోదాలో ఆయన పొంగులేటి, జూపల్లిలకు ఆహ్వానం పలికారు. 
కవితను అరెస్ట్ చేయలేని మీ పార్టీ ప్రభుత్వం మేము చేరితే ప్రజలు మమ్మల్ని ఓడగట్టడం ఖాయమన్నారు. మేమే కొత్త పార్టీ పెడుతున్నాం మీరే మా పార్టీలో చేరండి అని పొంగులేటి, జూపల్లిలు ఈటెలను ఆహ్వానించారు. చేసేదేమి లేక ఈటెల వెనుదిరిగిపోయారు. బిజెపిలో చేరికల కమిటీకి బదులు ఎగ్జిట్ కమిటీ పెట్టి బిజెపినుంచి బయటకు వెళ్లే వారిని కాపాడుకోవాలని రాజకీయ విశ్లేషకుడు ఒకరు వాఖ్యానించారు.