చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో    సిఐడి విచారణకు హాజరైన జోగి రమేష్ 

వైకాపా హాయంలో అప్పటి ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసిన కేసులో  మాజీ మంత్రి జోగి రమేష్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. సిఐడి అధికారులు ఇప్పటికే ఆయనకు నోటీసులు జారి చేశారు. ఈ  నోటీసులు అందుకున్న జోగి రమేష్ శుక్రవారం సిఐడి  విచారణకు హజరయ్యారు. విజయవాడ తాడి గడపలోని సిఐడి కార్యాలయానికి ఆయన వచ్చారు. 
2021లో చంద్రబాబు నివాసంపై జోగి రమేష్ తన అనుచరగణంతో దాడి చేశారు. తాడేపల్లి పిఎస్ లో కేసు నమోదు అయినప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చాక  సిఐడికి బదిలీ అయ్యింది. ఇప్పటికే రెండుసార్లు విచారణకు హాజరైన జోగి రమేష్ మూడోసారి అంటే శుక్రవారం  సిఐడి విచారణకు హాజరయ్యారు. కేసు నమోదైన తర్వాత జోగి రమేష్ రాజకీయాలకు కూడా దూరమయ్యారు. ఎవరికి కనిపించకుండా తిరుగుతున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu