ఆ మంత్రి... పెద్ద కంత్రి

 

కంచే చేను మేస్తే ఎలా ఉంటుంది? న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తూ అన్యాయం చేయడంలా ఉంటుంది. అలాంటి న్యాయశాఖ మంత్రి అన్యాయం లేటెస్ట్గ్ గా బయటపడింది. ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ బీహార్ లోని తిలక్ మాంఝీ భాగల్పూర్ యూనివర్సిటీలో తాను చదివినట్లు చూపించిన సర్టిఫికెట్లు నకిలీవని యూనివర్శిటీ స్పష్టం చేసింది. ఆ సీరియల్ నెంబరుతో వేరే వ్యక్తి ఉన్నారని తెలిపింది. దీనిపై హైకోర్టు స్పందిస్తూ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ విద్యార్హతల్ని ప్రశ్నిస్తూ దీనిపై ఆగష్టు 20 వ తేదీలోపు సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఇక తోమర్ చేసిన పనికి ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. మరోవైపు ఆప్ బహిష్కృత నేత ప్రశాంత్ భూషణ్ తోమర్ ను వెంటనే పార్టీ నుండి తొలగించకపోతే తాము ఢిల్లీ సెక్రటేరియట్ ముందు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. దీంతో కేజ్రీవాల్ జితేందర్ సింగ్ తోమర్ ను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించారు. కాని జితేందర్ సింగ్ మాత్రం ఈ వాదనలన్నీ తోసిపుచ్చి, తన సర్టిఫికెట్ వందశాతం నిజమైనదని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అన్నారు.