రాహుల్ వల్లే భూకంపం వచ్చిందా?

 

జీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోసారి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హరిద్వార్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాహుల్ గాంధీ బీఫ్ (ఆవు మాంసం) తిని తనను తాను శుద్ధి చేసుకోకుండా కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించినందుకే నేపాల్, భారత్ లో భూకంపం వచ్చిందని విమర్శించారు. సాక్షి మహారాజ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధికార ప్రతినిధి సుస్మితా దేవ్ మాట్లాడుతూ... ఇంతకు ముందు ఆడవాళ్లు 10 మంది పిల్లల్ని కనాలి, కుక్కల మాదిరి పిల్లల్పి కనకుండా మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ వల్లే భూకంపం వచ్చిందని అర్ధరహితంగా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీని డిమాండ్ చేస్తున్నానని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu