టీఆర్ఎస్ లో చేరనున్న జయసుధ..!!
posted on Jan 29, 2014 7:38PM

సీనియర్ సినీ నటి, సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జయసుధ త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో ప్రత్యర్థివర్గాలు తనకు వ్యతిరేకంగా పనిచేస్తుండటం, గత ఎన్నికల సమయంలో ఉన్నట్టుగా పార్టీలో పెద్ద దిక్కు లేకపోవడంతో నియోజకవర్గంలో పరిస్థితులు ప్రతికూలంగా మారాయని జయసుధ భావిస్తున్నారు. మల్కాజ్‌గిరి నుంచి లోక్‌సభ స్థానానికి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న జయసుధ..మహబూబునగర్ జిల్లాకు చెందిన సీనియర్ మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే ద్వారా కెసిఆర్ కు రాయబారం పంపినట్లు సమాచారం. మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలోని అన్ని శాసన సభ నియోజకవర్గాల్లో సెటిలర్లతో పాటు, మైనారిటీవర్గాలకు చెందిన ఓటర్లు కూడా గణనీయంగా ఉండటం వల్ల గెలుపు అవకాశాలు ఉంటాయని ఆమె భావిస్తున్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు తేలిన తరువాత ఎంపీ టిక్కెట్ పై నిర్ణయం తీసుకుంటామని జయసుధకు చెప్పారని పార్టీ వర్గాలు అంటున్నాయి.