ఏదో ఆశించే పార్టీల్లోకి చేరుతారు.. జయసుధ
posted on Jan 25, 2016 10:03AM

సినీ నటి జయసుధ ఇటీవలే టీడీపీలోకి చేరిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ మార్పుపై ఆమె మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా వేరే పార్టీ మారేది ఖచ్చితంగా ఏదో ఒకటి ఆశించే అని అన్నారు. అంతేకాదు తన పద్దతులేంటో తనకు తెలుసని.. రాజకీయాల్లో అందరూ ఒకేలా ఉండాలని లేదని.. తెలుగు దేశం పార్టీలోకి చేరినప్పటికీ తాను తన పద్దతిలోనే ఉంటానని చెప్పారు. అధికార పార్టీలో ఉంటేనే ప్రజలకు మేలు చేయడానికి కుదురుతుందని.. అందుకే టీడీపీలో చేరాను.. త్వరలో గ్రేటర్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీడీపీ ఆదేశిస్తే ప్రచారం చేస్తానని చెప్పారు. సినిమాల్లో కన్నా రాజకీయాల్లోనే పెద్ద నటులు ఉన్నారని ఆమె అన్నారు.
అంతేకాదు మా ఎన్నికల గురించి కూడా ఆమె మాట్లాడుతూ మా ఎన్నికల్లో పోటీకి తనను ఎవరూ బలవంతం చేయలేదని.. నేనే పోటీ చేశానని అన్నారు. అయినా పోటీ అనేది ఎన్నికల వరకే అని.. సినిమా పరిశ్రమ అంత ఒకటేనని స్పష్టం చేశారు.