రిపబ్లిక్ డే హై అలర్ట్.. ఎన్‌కౌంటర్ టెన్షన్
posted on Jan 25, 2016 10:25AM

రిపబ్లిక్ డే సందర్బంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. రేపు రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందని అనుమానించి భద్రతా దళాలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. అయితే ఈ భద్రతా దళాల బందోబస్తు నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి ఘజియాబాద్‌లో ఎన్‌కౌంటర్ జరుగడం కలకలం రేపింది. ఢిల్లీకి సమీపంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పోలీసు చెక్‌పోస్టు వద్ద ఎన్‌కౌంటర్ జరిగింది. దీంతో పోలీసులు అలర్ట్ అయి ఘటనా స్థలానికి వెళ్లి ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మిగిలిన నిందితులు పరారైనట్టు తెలుస్తోంది. కాగా అరెస్ట్ అయిన వ్యక్తి పేరు అంకిత్ అని.. అతను ఓ పేరు మోసిన దొంగ అని.. అతని పేరు 25వేల రివార్డ్ కూడా ఉందని పోలీసులు తెలిపారు.