జయలలిత ప్రమాణ స్వీకారం.. స్టాలిన్ సీటుపై వివాదం..
posted on May 24, 2016 5:44PM

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీ డీఎంకే నేత ఎం.కే స్టాలిన్ కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో ఆయన వెనుక వరుసలో కూర్చోవడంపై వివాదాలు తలెత్తుతున్నాయి. దీంతో దీనిపై జయలలిత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. స్టాలిన్ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు అధికారులు ముందుగానే తనకు చెప్పి ఉంటే ప్రోటోకాల్ పక్కనపెట్టి ఆయనకు ముందు వరుసలో సీటు కేటాయించమని చెప్పేదానినని.. స్టాలిన్ శాసనసభ్యుల కోసం కేటాయించిన సీటులో కూర్చున్నారని ఆమె అన్నారు. దీనిలో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. స్టాలిన్ పట్ల, వారి పార్టీ పట్ల తనకు ఎలాంటి అగౌరవం లేదని, రాష్ట్రాభివృద్ధికి వారితో కలిసి పని చేయాలనుకుంటున్నామని జయలలిత చెప్పారు. మరి దీనిపై డీఎంకే పార్టీ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.