దేశంలో అత్యాచారాలు పెరగడానికి గాంధీ కుటుంబమే కారణం.. బీజేపీ ఎమ్మెల్యే
posted on May 24, 2016 5:05PM
.jpg)
బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. వివాదాస్పద విషయాల్లో ఇరుక్కోవడం కామన్. గతంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థులు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే గ్యాన్ దేవ్ ఆహుజా ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ గాంధీ కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యాచారాలు పెరగడానికి నెహ్రూ, గాంధీ కుటుంబమే కారణమని.. వ్యాఖ్యానించారు. అన్ని రకాల సామాజిక సమస్యలకు నెహ్రూ కుటుంబమే కారణమని.. ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ విగ్రహాలను ధ్వంసం చేసినట్లుగా.. మన దేశంలో నెహ్రూ, గాంధీలకు సంబంధించిన అన్ని విగ్రహాలను, ఇతర స్మారకాలను ధ్వంసం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మరి దీనిపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.