మోడీ సమక్షంలో సీఎంగా ప్రమాణం చేసిన సోనోవాల్..

]
అసోం ముఖ్యమంత్రిగా శర్వానంద సోనావాల్ ప్రమాణ స్వీకారం చేశారు. గౌహతిలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ పీబీ ఆచార్య సోనావాల్ చేత ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు పది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఆరుగురు బీజేపీ సభ్యులుకాగా, అసోం గణపరిషత్‌కు చెందిన ఇద్దరు, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీకి చెందిన ఇద్దరు ఉన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీతో పాటు బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu