జానారెడ్డి పార్టీ మారడానికే ఇలా చేస్తున్నారా?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి గులాబీ రంగు పూసుకోనున్నారా? కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ గూటికి చేరుతున్నారా? అంటే అవునని కొంత మంది రాజకీయ నేతలు అనుకుంటున్నారు. తెలంగాణ సీనియర్ నేత డీ.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లోకి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జానారెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దపడుతున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి.

ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీకి సరైన ఉనికి లేదు. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఉన్నా పెద్ద ప్రయోజనం లేదని అనుకున్నారేమో పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది జానారెడ్డి. దీనిలో భాగంగానే ముందునుంచి ఆయన పార్టీ వ్యవహారాలను కూడా అంతగా పట్టించుకోవడం.. దీనిపై ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ఆయనమీద ఆగ్రహంగా ఉండటం అన్నీ జరుగుతూనే వస్తున్నాయి. అంతేకాక అధికార పార్టీ.. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసినా అధికార పార్టీని పల్లెత్తు మాటకూడా అనకుండా టీఆర్ఎస్ పార్టీకి ఒత్తాసు పలకడం.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలతో అధికార పార్టీకి క్షమాపణలు చెప్పిండటం.. ఇవన్నీ ఆయన పార్టీపై మరింత అనుమానాలు ఎదురవుతున్నాయి. దీనికి తోడు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు అన్నిపార్టీలు కలిసి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నిన్న చేపట్టిన తెలంగాణ బంద్ కు జానారెడ్డి డుమ్మాకొట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతల కోపం నషాళానికి అంటింది.

అయితే జానారెడ్డి మాత్రం తాను కాంగ్రెస్ వాదినే అని  ఎవరి సర్టిఫికెట్టూ తనకు అవసరం లేదని చెప్పుకొస్తున్నారు. కానీ పార్టీ నేతలు మాత్రం జానారెడ్డి తీరుపై చాలా అసహనంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో రాహుల్ గాంధీ కూడా జానారెడ్డితో ఏం సార్ పార్టీ మారుతున్నారా అని కూడా సెటైర్లు వేశారు. అయితే కొంతమంది మాత్రం జానారెడ్డి పార్టీ మారేందుకు కావాలనే ఇలా వ్యవహరిస్తున్నారని.. కావాలనే అధిష్టానంతోనూ.. పార్టీ నేతలనూ కయ్యం పెట్టుకోవడానికి చూస్తున్నారని అనుకుంటున్నారు. అయితే కేంద్రం తనంతట తానుగా పంపించినా.. లేక తాను స్వయంగా వెళ్లిపోయినా తనకే మంచిదని భావిస్తున్నట్టు రాజకీయ వర్గాలతో పాటు పార్టీ నేతలు కూడా అనుకుంటున్నారు. మొత్తానికి రాజకీయానుభవం జానాకు బాగానే వర్కవుట్ అయినట్టు ఉంది. మరి జానా కూడా పార్టీ మారే రోజు తొందరలోనే ఉందని తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu