జగన్ పార్టీలో చిచ్చు
posted on Mar 30, 2013 3:04PM
.jpg)
నియోజకవర్గాల సమన్వయకర్తల నియామకం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతోంది. తాజాగా నిజామాబాద్ లో నియోజకవర్గాల సమన్వయకర్తల నియామకాన్ని నిరసిస్తూ ఆ పార్టీ జిల్లా కన్వీనర్ వెంకటరమణారెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. వెంకటరమణారెడ్డి బాటలోనే మరికొందరు రేపో మాపో రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. కార్యకర్తలకు, కష్టపడి పనిచేసే నాయకులకు పార్టీలో అన్యాయం జరుగుతుందని, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ నేత డబ్బులు తీసుకుని నియోజకవర్గాల సమన్వయకర్తలను నియమించారని, కష్టపడే వారిని వదిలేసి ధనవంతులకు పార్టీలో పెద్దపీట వేస్తున్నారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.